తలమడుగు బీజేపీ అధ్యక్షుడు హౌస్ అరెస్ట్

ADB: తలమడుగు మండల బీజేపీ అధ్యక్షుడు నక్క ధనుంజయ్‌ను పోలీసులు ఆదివారం హౌస్ అరెస్ట్ చేశారు. ప్రదాని నరేంద్రమోదీ పై కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహన చేపట్టాల్సి ఉండగా.. ఈ మేరకు రుయ్యడి లోని ఆయన ఇంటి వద్ద పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.