శ్రీకాకుళంలో నేడు జాబ్ మేళా

SKLM: అభ్యుదయ డిగ్రీ కళాశాలలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి ఉద్యోగాల భర్తీ నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఉరిటి సాయి కుమార్ తెలిపారు. మాన్ కైన్డ్ ఫార్మా సంస్థలో ఖాళీల భర్తీకి ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. బీఎస్సీ కెమిస్ట్రీలో 70% మార్కులతో పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులన్నారు.