ఇంఛార్జ్ డీఈవోగా నాగపద్మజ నియామకం

KMM: ఖమ్మం జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో నాగపద్మజ ఇంఛార్జ్ జిల్లా విద్యాశాఖాధికారిగా నియమితులయ్యారు. ఈమేరకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్నాళ్లు డీఈవోగా కొనసాగిన సత్యనారాయణ ఇటీవల ఉద్యోగ విరమణ చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ప్రస్తుతం ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతుండడంతో నాగపద్మజను ఇంఛార్జ్ డీఈవోగా నియమించారు.