ఎరుపెక్కిన గోదావరి జలాలు

ఎరుపెక్కిన గోదావరి జలాలు

E.G: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి కొత్త నీరు వచ్చి చేరింది. గడిచిన నాలుగైదు రోజులుగా నీలి వర్ణంలో ఉన్న గోదావరి నీరు మళ్లీ ఎరుపెక్కింది. ఆదివారం ధవళేశ్వరం ఆనకట్ట నుంచి దిగువకు 2.48 లక్షల క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. నవంబర్‌లో గోదావరికి ఇంత మొత్తంలో వరద నీరు వస్తుందని తేలిపారు.