విషాదం.. విద్యుత్ షాక్‌తో అసిస్టెంట్ లైన్ మెన్ మృతి
ADB: విద్యుత్ షాక్‌తో అసిస్టెంట్ లైన్ మెన్ మృతి చెందిన ఘటన గురువారం భీంపూర్ మండలంలో చోటుచేసుకుంది. రూరల్ సీఐ ఫణిదర్ తెలిపిన వివరాల ప్రకారం.. తాంసికి చెందిన అనిల్ పాటిల్‌ను గురువారం అధికారులు భీంసరి సమీపంలో 33KV విద్యుత్ స్తంభం పైకి ఎక్కించారు. మరమ్మత్తులో భాగంగా విద్యుత్ సరఫరా నిలిపివేయకపోవడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు.