నేడు విద్యుత్ సరఫరాకు ఆటంకం
AKP: అచ్యుతాపురం మండలంలో పలు గ్రామాలకు ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రాజశేఖర్ తెలిపారు. విద్యుత్ లైన్ల నిర్మాణం పనులు చేపడుతున్న కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రామన్నపాలెం, ఎరుకన్నపాలెం, చీమలాపల్లి, అప్పన్నపాలెం, దొప్పర్ల, చాకలిపేట, భోగాపురం తదితర గ్రామాలకు విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తున్నామన్నారు.