VIDEO: కిరాణా షాపులో షార్ట్ సర్క్యూట్.. ఆస్తి నష్టం
ఏలూరు పట్టణంలో గత అర్ధరాత్రి ఒక కిరాణా దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కిరాణా షాపులో ఉన్న ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు యజమాని తెలిపారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో సుమారు 3 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. దుకాణంలో ఉన్న సరుకులు అగ్నికి ఆహుతయ్యాయి.