పెర్త్ ఓటమి బాధించింది: మెక్‌కల్లమ్

పెర్త్ ఓటమి బాధించింది: మెక్‌కల్లమ్

పెర్త్‌లో ఎదురైన ఓటమి తమను ఎంతగానో బాధిస్తుందని ఇంగ్లండ్‌ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ అన్నాడు. ఈ ఓటమి నుంచి త్వరగా తేరుకుంటుమన్నాడు. అలాగే, రెండో టెస్టులో తమ జట్టు పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. కఠినమైన వికెట్‌పై హెడ్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతమని కొనియాడాడు. హెడ్‌ను ఓపెనర్‌గా పంపడం సాహసోపేత నిర్ణయమని ఆసీస్ కోచ్‌ను అభినందించాడు.