VIDEO: గ్రంథాలయంలో ఆకస్మిక తనిఖీలు
SKLM: లావేరు శాఖా గ్రంథాలయాన్ని గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పీరికట్ల విఠలరావు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయములో ఉండే పుస్తకాలను, రీడింగ్ రూమును పరిశీలించారు. అలాగే, గ్రంథాలయంలో చేస్తున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాల క్లిప్పింగులను చూశారు. గ్రంథాలయ అభివృద్ధి పట్ల ఆయన అభినందనలు తెలిపారు.