ఫోన్ సాయంతో చిన్నారిని కాపాడిన యువకుడు

TG: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో కారులో చిక్కుకున్న చిన్నారిని ఓ యువకుడు ఫోన్ సహాయంతో కాపాడాడు. కుటుంబ సభ్యులు కారు కీస్ లోపలే మర్చిపోవడంతో డోర్ లాక్ కాగా, చిన్నారి కారులోనే చిక్కుకుపోయింది. ఆ యువకుడు డోర్ ఎలా తెరవాలో ఫోన్‌లో చూపించాడు. చాకచక్యంగా డోర్ ఓపెన్ చేసిన చిన్నారి సురక్షితంగా బయటకు వచ్చింది. దీంతో యువకుడి సమయస్ఫూర్తిని స్థానికులు అభినందించారు.