'భావితరాల భవిష్యత్ కోసమే కోటి సంతకాల సేకరణ'
సత్యసాయి: భావితరాల భవిష్యత్ కోసమే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించినట్లు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ తెలిపారు. శుక్రవారం గోరంట్ల మండలం పొప్పనపల్లి తాండ, కాటేపల్లి, రాగిమేకలపల్లి, సామలపల్లి, గ్రామాలలో ప్రజల నుంచి ఆమె సంతకాలు సేకరించారు. ఆమె మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు పెద్ద ఎత్తున నష్టపోతారని తెలిపారు.