VIDEO: పంచ సూత్రాల గురించి రైతులకు వివరించిన ఎమ్మెల్యే
కృష్ణా: రైతాంగానికి కూటమి ప్రభుత్వం అన్ని వేళల భరోసాగా ఉంటుందని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. మోటూరు గ్రామంలో 'రైతన్న మీకోసం' కార్యక్రమాన్ని కూటమి నేతలతో కలిసి ఆయన బుధవారం నిర్వహించారు. మోటూరు గ్రామ రైతు సేవ కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో రైతుల శ్రేయస్సు కోసం సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన పంచ సూత్రాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు.