జూన్ 14 వరకు చేపల వేట నిషేధం
ప్రకాశం: కొత్తపట్నం (మం) సింగరాయకొండ, పాకాల ప్రాంతాలలోని సముద్ర తీరంలో ఏప్రిల్ 14 నుంచి జూన్ 14 వరకు చేపల వేట నిషేధిస్తున్నట్లు మత్స్యశాఖ అధికారులు తెలిపారు. నిషేధ సమయంలో నెలకు రూ. 20 వేలు జాలర్లకు జీవనభృతి ఇవ్వడం జరుగుతుందని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారి లైసెన్స్ రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు.