VIDEO: సీతారాముల కళ్యాణంకు హాజరైన ఎమ్మెల్యే
KMR: రామారెడ్డి మండల కేంద్రంలోని రామాలయంలో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణ వేడుకలకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరాముడి దంపతులను ప్రజలు ఆదర్శంగా తీసుకుని జీవించాలని సూచించారు. అనంతరం భక్తులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.