ఫూలే స్ఫూర్తికి భిన్నంగా కాంగ్రెస్ పాలన: బండి
TG: అణచివేతపై తిరుగుబాటుకు కేరాఫ్ అడ్రస్ మహాత్మా జ్యోతిబా ఫూలే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కొనియాడారు. ఈరోజు ఫూలే జయంతి సందర్భంగా ఆయనకు కేంద్ర మంత్రి ఘనంగా నివాళులు అర్పించారు. బలహీనవర్గాల ప్రజలను చైతన్య పరచడంలో ఆయన కృషి అమోఘమని ప్రశంసించారు. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ పాలన ఫూలే ఆశయాలకు, స్ఫూర్తికి పూర్తి భిన్నంగా సాగుతోందని విమర్శించారు.