రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
E.G: కొవ్వూరు మండలం అరికిరేవుల వద్ద బుధవారం రాత్రి జరిగిన యాక్సిడెంట్‌లో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో రాజమహేంద్రవరంలోని పిడుగుకు చెందిన వెంకటరమణ(50) మరణించారని సీఐ విశ్వ తెలిపారు. బైక్‌పై కొవ్వూరు నుంచి తాళ్లపూడికి వెళుతుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.