'మార్కాపురంలో అక్రమ కట్టడాలు'
ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని చెన్నరాయుడు పల్లిలో పేదలకు ప్రభుత్వం ఇచ్చిన నివాస స్థలాలలో అక్రమార్కులు అక్రమ కట్టడాలకు తెర లేపారు. లబ్ధిదారులు హౌసింగ్, రెవిన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి, వాటిని తొలగిస్తున్నారు. మార్కాపురం జిల్లాగా ప్రకటించడంతో తర్లుపాడు రోడ్డులో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.