పొన్నూరు ఆలయంయ రేపు మూసివేత: ఈవో

GNTR: ఈనెల 7న చంద్రగ్రహణం కారణంగా పొన్నూరులోని ప్రసిద్ధ శ్రీ వీరాంజనేయస్వామి వారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ ఈవో వెంకట అమర్నాథ్ శనివారం తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ఆలయం మూసి ఉంటుందని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.