పదిలో మంచి ఉత్తీర్ణత సాధించాలి: ఎంఈవో

పదిలో మంచి ఉత్తీర్ణత సాధించాలి: ఎంఈవో

KRNL: పదవ తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించి జిల్లాలో మొదటి స్థానంలో నిలవాలని మంత్రాలయం ఎంఈవో రాగన్న అన్నారు. ఆయన మంత్రాలయం మండలం రాంపురం, తుంగభద్ర గ్రామాల్లో ఉన్న జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలను సందర్శించారు. పదవ తరగతి విద్యార్థులకు తగు సలహాలు, సూచనలు ఇచ్చారు. పరీక్షల సమయంలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి పరీక్షలు రాయడం చాలా ముఖ్యమున్నారు.