బేస్తవారిపేటలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని ఖాజీపురం గ్రామంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ రఫీక్ రైతులకు పంట దిగుబడికి మరియు పంట సాగుకు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు.