చిలకలూరిపేటలో 10 సెల్‌ఫోన్‌ల రికవరీ

చిలకలూరిపేటలో 10 సెల్‌ఫోన్‌ల రికవరీ

PLD: చిలకలూరిపేట పట్టణంలో చోరీకి గురైన 10 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వీటిని అర్బన్ సీఐ పి.రమేష్ బుధవారం బాధితులకు అప్పగించారు. పట్టణంలో పోయిన సెల్‌ఫోన్‌లపై వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేసి వీటిని పట్టుకున్నారు. చోరీలను అరికట్టి, ప్రజల ఆస్తులను రక్షించేందుకు తమ సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని సీఐ తెలిపారు.