'ఇంటి పన్నుల వసూలు వేగవంతం చేయాలి'
CTR: గుడిపాల మండలంలో ఇంటి పన్నుల వసూళ్లపై ఎంపీడీవో శిరీష చొరవ తీసుకున్నారు. ఉదయం 6 గంటలకు అధికారులు, సచివాలయ సిబ్బందితో కలిసి వసూళ్లు మొదలుపెట్టారు. రెండు రోజుల్లో 100% పన్నులు వసూలు చేసి పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యదర్శుల సహకారంతో ఇంటి పన్నులు ఎక్కువగా వసూలయ్యాయని, ప్రజలు సహకరిస్తున్నారని చెప్పారు.