పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీకి సిద్ధం

SKLM: భూసారం పెంచేందుకు దోహదపడే పచ్చిరొట్ట విత్తనాలు 50 శాతం రాయితీపై విక్రయానికి సిద్ధంగా ఉన్నాయని మెలియాపుట్టి ఏవో ఎస్.దాన కర్ణుడు మంగళవారం తెలిపారు. జీలుగు విత్తనాలకు 50 శాతం రాయతీ పోను కిలో విత్తనాలు రూ.61.50, కట్టిజనుము కిలో రూ.54.50, పిల్లి పెసర రూ.90లకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఎకరానికి సుమారుగా 30 కిలోల విత్తనాలు అవసరం ఉంటాయన్నారు.