డుంబ్రిగుడ కాలేజీలో 84% ఉత్తీర్ణత

డుంబ్రిగుడ కాలేజీలో 84% ఉత్తీర్ణత

ASR: డుంబ్రిగుడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ద్వితీయ సంవత్సరంలో 84%, మొదటి సంవత్సరంలో 72% ఉత్తీర్ణత నమోదైంది. జే. అప్పలరాజు 843 మార్కులతో టాపర్‌గా, కిలో దేవి 798 మార్కులతో రెండో స్థానం సాధించారు. మొదటి సంవత్సరంలో పి. అనిత, ఐజాక్ పాల్, కొర్ర సునీతలు మెరుగైన మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ తెలిపారు.