కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభం

KNR: కరీంనగర్ పట్టణంలోని రేకుర్తిలో గల సాయి లక్ష్మి ఫంక్షన్ హాల్‌లో సౌత్ ఇండియా కరాటే ఓపెన్ ఛాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలు మొబైల్‌లకు దూరంగా ఉండి క్రీడలకు దగ్గరవడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంచుకోవచ్చని, తద్వారా చదువుల్లోనూ రాణిస్తారని తెలిపారు.