ప్రతి పంటలకు సాగునీరు అందేలా చర్యలు: ఎమ్మెల్యే

NDL: డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి డోన్ మండలంలోని ఉడుములపాడు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, టీడీపీ నాయకులు, గ్రామస్తులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. బుధవారం ఎమ్మెల్యే, ఇరిగేషన్ అధికారులతో కలిసి గ్రామంలోని చెరువును పరిశీలించారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులు వేసిన ప్రతి పంటకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.