APK ఫైల్.. రూ. 98,100 మాయం

APK ఫైల్.. రూ. 98,100  మాయం

MDCL: పీఎం కిసాన్ కొత్త జాబితా విడుదలైందంటూ వాట్సాప్‌లో వచ్చిన ఏపీకే ఫైల్‌ను క్లిక్ చేసిన బోడుప్పల్ ద్వారక నగర్ ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి సైబర్ మోసానికి గురయ్యాడు. ఫైల్ ఇన్‌స్టాల్ చేసిన వెంటనే అతని మొబైల్ హ్యాక్ అయింది. అనంతరం బ్యాంకు ఖాతా నుంచి సుమారు రూ.98,100 మాయమయ్యాయి. అనుమానాస్పద లింకులు, ఏపీకే ఫైళ్లను డౌన్‌లోడ్ చేయొదని పోలీసులు సూచించారు.