వెలగని వీధి లైట్లు.. ప్రజల ఇబ్బందులు

వెలగని వీధి లైట్లు.. ప్రజల ఇబ్బందులు

KMM: ఖమ్మం నగరం వన్ టౌన్ 26వ డివిజన్ రామాలయం వీధిలో నుండి బ్రాహ్మణ బజార్‌కు వెళ్ళే గల్లీలో గత నాలుగు రోజుల నుండి రాత్రిపూట వీధిలైట్లు వెలగక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. చీకటిగా ఉండటంతో కుక్కల అరుపులతో ఆ ప్రాంతమంతా గందరగోళంగా మారింది. తెల్లవారుజామున పాలుపోసే వారి వాహనముల వెంట, ట్యూషన్‌కు వెళ్ళే విద్యార్థుల వెంట కుక్కలు వెంటపడుతున్నాయి.