వైభవంగా గంగమ్మ ఆలయ రెండవ వార్షికోత్సవం
CTR: పుంగనూరు పట్టణం బెస్త వీధి శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయ రెండవ వార్షికోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఆలయ ఆవరణలో వేద పండితులు హోమాలు చేశారు. తర్వాత అమ్మవారి విగ్రహాన్ని ఫల పంచామృతాలు, వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించి ధూప, దీప, నైవేద్యాలను సమర్పించారు. దీంతో భారీగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.