శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు విజయవంతం: ఛైర్మన్

శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు విజయవంతం: ఛైర్మన్

NDL: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ దేవస్థానం ఛైర్మన్ రమేశ్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. గతేడాది కంటే ఈ ఏడాది భక్తుల రద్దీ పెరిగిందని, ఇప్పటివరకు 6 లక్షల మందికి పైగా దర్శించుకున్నారని పేర్కొన్నారు. భక్తులకు కనీస వసతులు కల్పించామన్నారు.