'దళితులపై అనుచిత వ్యాఖ్యలు హేయమైన చర్య'

'దళితులపై  అనుచిత వ్యాఖ్యలు హేయమైన చర్య'

EG: గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చేసిన వ్యాఖ్యలను జై భీమ్ దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళ్ల రాజు తీవ్రంగా ఖండించారు. బుధవారం రాజమండ్రిలో దళిత సంఘ నాయకులతో సమావేశం అయ్యి మాట్లాడారు. గతంలో అప్పారావు దళితుల అండదండలతోనే అనేక పదవులు పొందారన్నారు. ఇప్పుడు దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దగదన్నారు.