అప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి: సింగర్ రేలారే గంగ
HYD: తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ భవన్ పుట్టింటి లాంటిదని సింగర్ రేలారే గంగ అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజున ఆయన ఎర్రవెల్లి నివాసానికి వెళ్లామన్నారు. అందరికీ కూర్చుని ఫోటోలు ఇస్తుంటే.. మా కళాకారుల బృందం వెళ్లగానే మాజీ సీఎం కేసీఆర్ లేచి నిలబడ్డారని, అప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయని తెలిపారు.