మాచర్ల రథోత్సవంలో బంగారు ఆభరణాల చోరీ
PLD: మాచర్ల శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి రథోత్సవంలో దొంగలు హల్చల్ చేశారు. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని భారీగా బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ముట్టుకూరు గ్రామానికి చెందిన సామ్రాజ్యం అనే మహిళ మెడలోని మూడు సవర్ణ నాంతాడు, మంగళ సూత్రంతో పాటు ఇద్దరు యువకుల గొలుసులను కేటుగాళ్లు కాజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.