'కళాశాలలను ప్రైవేటుపరం చేయడం దుర్మార్గం'
ASR: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం దుర్మార్గమని అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం మంగళవారం అన్నారు. వైసీపీ అధినేత ఆదేశాల మేరకు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశామన్నారు. కూటమి ప్రభుత్వ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు.