చేనేత దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

SKLM: చేనేత వస్త్రధారణతో ఆరోగ్యం పెంపొందించుకోవచ్చని, అదే సమయంలో చేనేత కార్మికులకు అండగా ఉంటూ ప్రోత్సహించ వచ్చని స్థానిక శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్రావు సూచించారు. గురువారం 11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపూజీ కళామందిర్‌లో ఏర్పాటుచేసిన వేడుకలలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు.