మా హయాంలో విజయనగరం అభివృద్ధి: మేయర్

VZM: విజయనగరం పట్టణంలోని 13వ డివిజన్ లో YCP నాయకుల ఆధ్వర్యంలో 'బాబు ష్యూరిటీ- మోసం గ్యారంటీ' కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, తదితరులు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. తమ హయాంలో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామని, సంక్షేమ పథకాలతో వెలుగులు నింపామన్నారు.