మల్లన్న దర్శనానికి 6 గంటల సమయం

మల్లన్న దర్శనానికి 6 గంటల సమయం

NDL: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం భక్తులతో నిండిపోయింది. ఎటు చూసినా శివ స్వాములు, సాధారణ భక్తుల మయమైంది. మల్లన్న సన్నిధిలో జాగారం చేసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా జారీ చేసిన ప్రత్యేక పాసులకు 3 గంటలు, ఉచిత దర్శనానికి 6 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.