'నాణ్యతతో పనులు పూర్తి చేయాలి'
SKLM: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అన్నపూర్ణ ఆశ్రమం వీధిలో ఎమ్మెల్యే శిరీష చొరవతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు త్వరితగతిన జరుగుతున్నాయి. ఈ పనులను టీడీపీ సీనియర్ నాయకుడు, APTPC ఛైర్మన్ వజ్జ బాబురావు ఇవాళ పరిశీలించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, ఎలాంటి లోపాలు లేకుండా వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు.