VIDEO: 'రహదారుల అభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యం'

SKLM: కూటమి ప్రభుత్వ హయాంలోనే గ్రామీణ ప్రాంతాలకు రహదారులు నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆదివారం పోలాకి మండలం దీర్ఘాసి పంచాయతీలో 20 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న రహదారి పనులను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రహదారులను అభివృద్ధి చేశామని తెలిపారు.