ఆరోగ్య మందిర్ సిబ్బంది నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం
ASF: కౌటాలలో జిల్లా కలెక్టర్ హరిత పలు ప్రభుత్వ సంస్థలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి గదులు, మెడిసిన్ స్టోర్‌ను పరిశీలించారు. నిత్యం మందులను అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. అనంతరం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో సిబ్బంది హాజరు, రికార్డులను పరిశీలించి సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.