108 జిల్లా మేనేజర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
MHBD: రాష్ట్ర వ్యాప్తంగా 108(అంబులెన్స్) సేవల్లో జిల్లా మేనేజర్ (EME) ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల ప్రోగ్రామ్ మేనేజర్ నజీరుద్దీన్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఆటోమొబైల్ రంగంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులని ఆయన వెల్లడించారు.