నేడు జిల్లాలో ఎమ్మెల్యే పర్యటన
NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఇవాళ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించనున్నారు. మండలంలోని జొన్నవాడ గ్రామంలో పీహెచ్‌సీ నందు ఉచిత సర్వికల్ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ను ప్రారంభిస్తారని కార్యాలయ ప్రతినిధులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని కూటమి నాయకులు పాల్గొనాలని వారు కోరారు.