తెగిన కాళేశ్వరం కాలువ.. కలెక్టర్ పరిశీలన

తెగిన కాళేశ్వరం కాలువ.. కలెక్టర్ పరిశీలన

SDPT: గజ్వేల్ మండలం దిలాల్‌పూర్ గ్రామంలో కాళేశ్వరం కాలువ తెగింది. భారీ వర్షానికి నీటి నిలువ పెరగడంతో పెద్ద ఎత్తున నీళ్లు కాలువలోకి చేరాయి. దీంతో నీటి తాకిడి పెరిగి కాలువ తెగిపోయింది. గ్రామానికి చెందిన పలువురు రైతుల పంట పొలాల్లోకి నీరు చేరింది. ఆయా పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతాన్ని కలెక్టర్ కె. హైమావతి పరిశీలించారు.