'మరణాంతరం అవయవాలను దానం చేయాలి'

'మరణాంతరం అవయవాలను దానం చేయాలి'

PDPL: మరణానంతరం వృథాగా పోయే, అవయవాలను దానం చేయాలని పలువురు వ్యక్తులు కోరారు. 8వ కాలనీలోని సంతోష్ నగర్‌కు చెందిన నేత్రదాత మూల వెంకట్ రెడ్డి సంస్మరణ సభ జరిగింది. మృతుని నేత్రాలను దానం చేసిన కుటుంబ సభ్యులకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. నేత్ర, అవయవ దానం ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. మరికొంత మంది దాతలు నేత్ర, అవయవ దానాలకు ముందుకు రావాలన్నారు.