డివైడర్ కనిపించక లారీ బోల్తా
పల్నాడు: ఫిరంగిపురం పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం రాత్రి ఓ లారీ బోల్తా కొట్టింది. నరసరావుపేట వైపు నుంచి వస్తున్న లారీ డ్రైవర్ అక్కడున్న డివైడర్‌ను సరిగ్గా గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. ఇప్పటికైనా రేడియం స్టిక్కర్లు, సూచిక బోర్డుల ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.