ఉపాధి హామీ కూలీలతో సమావేశమైన ఎమ్మెల్యే
PDPL: రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అంతర్గాం మండలం పెద్దంపేటలో 100 రోజుల పనుల ఉపాధి హామీ కూలీలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని టోపీలు, గ్లూకోజ్ వాటర్ పంపిణీ చేశారు. అనంతరం ప్రజాప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను, కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రాబోయే వేసవి అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.