VIDEO: భూ ఆక్రమణల ఆరోపణలపై ఎమ్మెల్యే సీరియస్
KRNL: నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలపై పత్రికల్లో వెలువడిన కథనాలను పరిశీలిస్తున్నట్లు ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు. సర్వే నంబర్ 630లో 3 ఎకరాలు 33 సెంట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందనే సమాచారం తన దృష్టికి వచ్చిందన్నారు. అలాగే 161, 162 సర్వే నంబర్లలో అక్రమాలపై వచ్చిన వార్తలను సీరియస్‌గా తీసుకున్నట్లు పేర్కొన్నారు.