అవార్డును అందజేసిన పిఓ

ADB: విద్యార్థుల భవిష్యత్తు అధ్యాపకుల చేతుల్లోనే ఉందని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్తా అన్నారు. పంద్రాగస్టును పురస్కరించుకొని శుక్రవారం పట్టణంలోని ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఉట్నూర్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ అధ్యాపకురాలుగా పనిచేస్తున్న బుర్ర మానసకు పిఓ కుష్బూ గుప్తా అవార్డును అందజేశారు.