బంగారు, వెండి ఆభరణాల చోరీ

SRD: కంది మండలానికి చెందిన బూస చంద్రమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఆమె ఇంట్లో చోరీ జరిగిందని చంద్రమ్మ కుమారుడు శ్రీశైలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తులంన్నర బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు ఆపహరణకు గురైనట్లు తెలిపారు. చోరీ జరిగిన ఇంట్లో క్లూస్ టీంతో తనిఖీలు నిర్వహించినట్లు సంగారెడ్డి రూరల్ ఎస్సై రవీందర్ చెప్పారు.