'బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి'

SRPT: రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. శుక్రవారం సూర్యాపేటలో జరిగిన జిల్లా స్థాయి విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ అమలుపై ఈనెల 9, 10 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.